Monday 6 July 2009

దుస్తులు

సౌందర్యం, అందవికారం ఒకనాటి సాయంత్రం ఓ సముద్ర తీరంలో కలిశాయి.

ఒకదానితో ఒకటి చెప్పుకున్నై- "మనం సముద్ర స్నానం చేద్దాం" అని.

రెండూ బట్టలు విప్పి, నీళ్ళలోకి దూకాయి. కొంచెంసేపు ఈదులాడిన తర్వాత, అందవికారం ఒడ్డుకు వచ్చింది. సౌందర్యం విడిచిన బట్టలు తను వేసుకొని, అందవికారం ఎటో వెళ్ళిపోయింది.

ఆ తర్వాత సౌందర్యం కూడా సముద్రంలోంచి బయటకు వచ్చింది. చూస్తే తన దుస్తులు ఎక్కడా కనబడలేదు. నగ్నంగా ఉండడం సిగ్గనిపించి, అది అందవికారపు బట్టల్నే వేసుకొని తన దారిన తను బయలుదేరింది.

అప్పటినుండీ ఈనాటికీ మనుషులు ఒకదానినొకటి అని భ్రమపడుతున్నారు.

అయితే కొందరు, సౌందర్యపు ముఖాన్ని చూసి గుర్తుపట్టేవాళ్ళు- అది వేరే దుస్తుల్లో ఉన్నా, చూసి గుర్తుపడుతున్నారు. అందవికారపు ముఖాన్ని గుర్తుపట్టేవాళ్లు కొందరు, అది ఏ దుస్తుల్లో ఉన్నా గుర్తిస్తూనే ఉన్నారు.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License