Monday, 6 July, 2009

ప్రేమగీతం

యువ కవి ఒకడు ఒకసారి ఒక ప్రేమగీతాన్ని రాశాడు. అది చాలా అందంగా వచ్చింది.

అతను దాని నకళ్ళు తీసి, తన స్నేహితులకూ, పరిచయస్తులకు- మగవాళ్ళకూ, ఆడవాళ్ళకూ కూడా పంపాడు.

వాటిలో ఒకటి కొడలకు ఆవల ఉన్న యువతి ఒకామెను చేరింది. ఆమెను కవి అంతకు ముందు ఎప్పుడో ఒకసారి మాత్రం కలిసి ఉన్నాడు.

ఇంకా రెండు రోజులు కూడా గడవలేదు- మనిషి ఒకడు, యువతి దగ్గర నుండి వర్తమానం తీసుకొని వచ్చాడు కవి దగ్గరకు.

ఆమె రాసింది- నువ్వు నా కోసం పంపిన ప్రేమగీతం నిజంగా నా మనసుకు హత్తుకున్నది. వెంటనే బయలుదేరిరా. మా అమ్మను, నాన్నను కలిసి, మన పెళ్ళికి సన్నాహాలు చేసుకుందాం" అని.

కవి ఆమెకు జవాబు పంపాడు. "స్నేహితురాలా! అది ఒక కవి హృదయం నుండి జనించిన ప్రేమగీతం మాత్రమే- దాన్ని ప్రతి యువకుడూ ప్రతి యువతికీ వినిపిస్తుంటాడు" అని.

ఆమె మళ్ళీ రాసింది అతనికి- "ఆత్మవంచకుడా! ద్రోహీ! నీ రాతలన్నీ బూటకాలే. నువ్వు చేసిన ఈ పనివల్ల నేను జీవితాంతం కవులందరినీ అసహ్యించుకుంటాను." అని!

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License