Monday 6 July 2009

ఇద్దరు యువరాణులు

షావాకిస్ నగరంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు. పిల్లలూ, పెద్దలూ అందరూ అతన్ని ఎంతో ప్రేమించేవారు. చివరికి పొలాల్లో నివసించే జంతువులు కూడా గౌరవంతో అతని దగ్గరికి వచ్చేవి. కానీ అందరూ చెప్పుకునేవాళ్ళు- "ఆ రాజకుమారుని భార్య- యువరాణి- అతన్ని ప్రేమించదు- నిజానికి ఆమె అతనిని తీవ్రంగా ద్వేషిస్తుంటుంది" అని.

ఒకసారి షావాకిస్ యువరాణిని సందర్శించేందుకు, ప్రక్కనగరపు యువరాణి విచ్చేసింది. వాళ్లిద్దరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. మెల్లగా ప్రసంగం వారి భర్తల వైపు మళ్ళింది:

షావాకిస్ నగర యువరాణి ఉద్వేగంగా అన్నది-" మీ పెళ్ళై చాలా కాలమైంది. అయినా మీ భార్యాభర్తలిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూస్తుంటే నాకు అసూయ వేస్తున్నది. నేను నా భర్త అయిన రాజకుమారుడిని భరించలేక పోతున్నాను. అతనంటే నాకు అసహ్యం వేస్తున్నది. అతనికి నేను ఒక్కదాన్నే కాదు! ప్రపంచంలో అత్యంత దు:ఖితను నేనే." అని.

సందర్శనకు వచ్చిన యువరాణి కొద్దిసేపు అలాగే చూసి, అన్నది మెల్లగా- "స్నేహితురాలా! వాస్తవంగా చెప్పాలంటే నీకు నీ భర్త అంటే ఇష్టం ఉన్నది. అతనిపట్ల నీలో చెరగని ఉద్వేగం చాలా ఉన్నది. తోటలోని వసంతం మాదిరి, స్త్రీ జీవనంలో ప్రాణం అదే. కానీ నువ్వు నిజానికి నన్ను, నా భర్తను చూసి జాలిపడాలి. ఎందుకంటే మేం ఒకరినొకరం సహనపు నిశ్శబ్దంతో భరిస్తూ వస్తున్నాము. అయినా ఇతరులు అందరూ దీన్నే సంతోషం అని భ్రమపడుతున్నారు." అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License