Saturday 25 July 2009

తారుమారు

ఒకసారి, ఒక కూడలిలో, ఒక పేద కవి ఒకడు, ధనికుడైన ఒక మూర్ఖుడిని కలిశాడు. వాళ్లిద్దరూ ఏవో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరి మాటలూ వారి వారి అసంతృప్తుల్నే వెళ్లగక్కుతున్నాయి.

ఆ రోడ్డు-దేవదూత అటుగా వెళ్తూ, వాళ్లిద్దరి మాటలూ విన్నాడు. అతను వాళ్లిద్దరి భుజాలమీదా చెయ్యి వెయ్యగానే, ఆశ్చర్యం! అద్భుతం ఒకటి జరిగింది. ఆ ఇద్దరి సంపదలూ తారుమారయ్యాయి! ఒకరి ఆస్తి వేరొకరిని చేరుకున్నది. ఆపైన ఇద్దరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లారు.

అయితే ఇంకా ఆశ్చర్యకరమైనదేదో జరిగింది:

కవి తన చేతుల్లో చూసుకుంటే అందులో ఏమీ లేదు- పొడి పొడిగా జారే ఇసుక తప్ప!

మూర్ఖుడు కళ్లుమూసుకుని చూస్తే అతని హృదయంలో ఏమీలేదు- కదిలే మేఘం ఒకటి తప్ప!

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License