Monday 6 July 2009

ముత్యం

ఒక ముత్యపు చిప్ప, తన పొరుగు మత్యపు చిప్పతో ఇలా అన్నది: "నా లోపల చాలా నొప్పిగా ఉంటోంది ఈ మధ్య. ఏదో చాలా బరువుగా గుండ్రంగా ఉంటోంది. ఈ బాధ భరించటం కష్టంగా ఉంది" అని.

రెండవది కొంచెం గర్వంతో కూడుకున్న పెద్దరికంతో అన్నది- "దేవుడు, సముద్రం నన్ను మాత్రం చల్లగా చూస్తున్నారు. నేనైతే లోపలా, బయటా కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నాకేం బాధా లేదు" అని.

అప్పుడే అటుగా పోతున్న ఎండ్రకాయ వీటిమాటలు విని, లోపలా, బయటా కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న ముత్యపు చిప్పతో అన్నది-" అవును, నువ్వు నిజంగానే చక్కగా, పూర్తిగా ఉన్నావు. అయితే నీ పొరుగు చిప్ప భరిస్తున్న బాధలో ఉన్నది అత్యంత సుందరమైన ముత్యం సుమా!" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License