Saturday, 25 July, 2009

పున్నమి

పున్నమి చంద్రుడు ఉదయించాడు పట్నం మీద, అద్భుతంగా. ఆ పట్నంలోని కుక్కలన్నీ చంద్రుడిని చూసి మొరగటం ప్రారంభించాయి.

ఒక్క కుక్క మాత్రం మొరగలేదు. అది మిగిలిన కుక్కల్ని గదమాయించింది గట్టి గొంతుతో- "నిశ్శబ్దం నిద్రపోతున్నది- నిద్ర లేపకండి. మీ మొరుగుళ్ళతో చంద్రుడిని భూమి మీదకు లాక్కురాకండి" అని.

అప్పుడు కుక్కలన్నీ మొరగటం ఆపివేశాయి. నిశ్శబ్దం ఆవరించింది.

కానీ వాటిని గదమాయించిన కుక్క మాత్రం నిశ్శబ్దం కోసం రాత్రంతా మొరుగుతూనే ఉంది.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License