Saturday 25 July 2009

శాపం

సముద్రాలపైన తిరుగాడీ తిరుగాడీ ముసలివాడైన ఓ తాత నాతో అన్నాడు ఒకసారి: "ముప్పై సంవత్సరాల క్రితం మామూలు నావికుడు ఒకడు మా అమ్మాయితో లేచిపోయాడు. నేను మా‌ అమ్మాయిని ప్రాణాధికంగా ప్రేమించాను. అందుకని నేను వాళ్లిద్దర్నీ కసిగా శపించాను, నా మనసులోనే.

అనతికాలంలోనే ఆ యువనావికుడు, వాడి పడవ నడి సముద్రంలో మునిగిపోయారు. అతనితో పాటే నా గారాల కూతురు కూడా నాకు కాకుండా పోయింది. అందువల్ల ఇప్పుడు నాకు భారంగా అనిపిస్తుంటుంది. ఒక నిండు యువకుడిని, యువతిని నేనే పొట్టనబెట్టుకున్నానని బాధ వేస్తుంటుంది. నా శాపమే వాళ్లిద్దర్నీ నాశనం చేసింది. చనిపోబోయే ఈ వయసులో నేను దైవ క్షమాపణ కోరుతున్నాను అందుకే" అన్నాడు.

ముసలాయన అలా అన్నాడు, కానీ అతని గొంతులో నాకు వేరే భావన ఏదో కూడా ధ్వనించిందనిపించింది. తన శాపానికి అంత శక్తి ఉందని అతడు గర్వపడుతున్నాడల్లే ఉంది."

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License