Saturday, 25 July, 2009

ఎర్రమట్టి

చెట్టు అన్నది, ఒక మనిషితో- "నా‌వ్రేళ్లు చాలా లోతైన ఎర్రమట్టిలో ఉన్నై, దృఢంగా. నేను నీకు నా పళ్లలో ఒక దాన్నిస్తాను. తిని చూడు, ఎలా ఉందో" అని.

ఆ మనిషి అన్నాడు చెట్టుతో - "ఆశ్చర్యం! మనిద్దరిలోనూ ఒకే గుణాలున్నై! నా మూలాలు కూడా చాలా లోతుగా ఉన్నాయి ఎర్రమట్టిలో. ఆ ఎర్రమట్టే, నీ పండునొక దాన్ని నాకు ఇచ్చేంత శక్తిని ప్రసాదించింది నీకు. అదే ఎర్రమట్టి, నువ్విచ్చిన దాన్ని కృతజ్ఞతతో స్వీకరించటం ఎలాగో నేర్పుతున్నది నాకు!" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License