Saturday 25 July 2009

తత్వవేత్త - చెప్పులు కుట్టేవాడు

ఒక చెప్పులు కుట్టేవాని దుకాణానికి ఒకసారి ఒక తత్వవేత్త వచ్చాడు- అరిగిపోయిన తన చెప్పుల్ని తీసుకొని.

అతను చెప్పులు కుట్టేవానితో అన్నాడు- "నా చెప్పుల్ని బాగుచేసి పెట్టు" అని.

చెప్పులు కుట్టేవాడు అన్నాడు "నేను ఇప్పుడు వేరే ఎవరివో చెప్పులు బాగుచేసి పెడుతున్నాను. మీ చెప్పులకు ముందు బాగుచేయాల్సిన చెప్పులు ఇంకా ఉన్నాయి. అందుకని ఓ పని చేయండి, మీ చెప్పుల్ని ఇక్కడ వదిలి , ఒక్క రోజుకు గాను యీ వేరే చెప్పుల్ని వేసుకెళ్లండి. రేపు వచ్చి మీ చెప్పుల్ని మీరు తీసుకెళ్లచ్చు" అని.

తత్వవేత్తకు అది ఇష్టం కాలేదు. "నావి కాని చెప్పుల్ని నేను వేసుకోను" అన్నాడతను.

అప్పుడు చెప్పులు కుట్టేవాడు అన్నాడు- "ఓహో! అయితే మీరు నిజంగా తత్వవేత్తలా? మీ పాదాల్ని ఇతర చెప్పులేవీ కప్పలేవు కదూ? ఇదే రోడ్డులో కొంచెం ముందుకు పోతే ఇంకో చెప్పులతను ఉన్నాడు. అతను తత్వవేత్తల్ని నా కంటే బాగా‌అర్థం చేసుకోగలడు. మీరు బాగు చేసుకోవడం కోసం అక్కడికి వెళ్లండి" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License