Friday 24 July 2009

ఇసుక మీది రాతలు

ఒక మనిషి ఇంకొకనితో అంటున్నాడు- "సముద్రం పోటెత్తి ఉన్నప్పుడు ఒకసారి, చాలా కాలం క్రితం, నా చేతి కట్టెతో సముద్రం ఒడ్డున ఇసుకలో ఒక వాక్యం రాశాను. ప్రజలు ఆ వాక్యాన్ని ఎంత ఇష్టపడ్డారంటే, దాన్ని చదివేందుకోసం వాళ్లింకా అక్కడ నిలబడిపోతున్నారు. ఆ వాక్యాన్ని ఏదీ చెరపకుండా ఉండేందుకుగాను వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు." అని.

రెండవ వ్యక్తి అన్నాడు- నేను కూడా ఇసుకలో ఒక వాక్యాన్ని రాశాను. కానీ అప్పుడు సముద్రం ఆటులో ఉంది. తర్వాత కెరటాలు ఆ వాక్యాన్ని చెరిపేశాయి. కానీ చెప్పు- నువ్వు ఏమని రాశావు?"

మొదటివాడన్నాడు- "ఉన్నదెవరో, అదే నేను!" అని రాశాను నేను. మరి నువ్వేం రాశావు?"

అప్పుడు రెండోవాడన్నాడు- " 'నేను ఈ సముద్రంలో కేవలం ఒక నీటిబొట్టును!' అని రాశాను నేను"

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License