Monday 6 July 2009

శరీరము-ఆత్మ

వసంతకాలంలో, తెరిచిన కిటికీ ప్రక్కగా ఒక యువ జంట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఒకరికొకరు దగ్గరగా ఉన్న ఆ సమయంలో, ఆమె అన్నది "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు అందగాడివి, ధనికుడివి, నువ్వు ఎప్పుడూ చక్కని దుస్తులు ధరిస్తావు."

అతను అన్నాడు "నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వొక అందమైన ఊహవు. నా చేతులకందనంత విశాలమైన దానివి. నా స్వప్నాలలోని గానానివి." అని.

కానీ ఆమెకు అతని మాటలు కోపం తెప్పించాయి. "ఇక నన్ను వదిలిపెట్టి పో. నేను ఊహను కాదు. కలల్లో వచ్చి పోయే వస్తువునూ కాదు. నేనొక అమ్మాయిని. నన్నొక పడుచుగా, భార్యగా, నీకు పుట్టబోయే పిల్లల తల్లిగా కోరతావని ఆశించాను. నా ఆశలన్నీ వమ్ములయ్యాయి." అన్నది.

వాళ్లిద్దరూ విడిపోయారు.

అతను అనుకుంటున్నాడు తనలోతాను-" చూడు, ఇంకొక కల, మంచుగా మారిపోయింది." అని.

ఆమె అనుకుంటున్నది "నన్నొక కలగాను, మంచుగాను మార్చేసేవాడితో నాకేమి పొత్తు?" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License