Saturday 25 July 2009

దానిమ్మలు

ఒక రైతు పండ్ల తోటలో చాలా దానిమ్మ చెట్లుండేవి. చాలా సంవత్సరాలపాటు దానిమ్మ పండ్లు కాసినప్పుడల్లా, అతను దానిమ్మ పండ్లను వెండి పాత్రల్లో పేర్చి, తన ఇంటి బయట పెట్టేవాడు. ఆ పాత్రలపైన, అందరికీ కనబడేటట్లు పెద్ద అక్షరాలతో "ఒక పండు తీసుకోండి, సంతోషంగా! ఇవన్నీ ఉచితం! మీ కోసమే!" అని రాసి పెట్టేవాడు.

చాలా మంది అతని ఇంటిమీదుగా వెళ్లేవాళ్లు, కానీ ఎవ్వరూ ఆ పండ్లను తీసుకునేవారు కారు.
అప్పుడా రైతు ఆలోచించి, ఓ సీజన్లో తన ఇంటి బయట వెండి పాత్రల్లో దానిమ్మ పండ్లు పెట్టలేదు. దాని బదులు పెద్ద పెద్ద అక్షరాలలో ఒక బోర్డు పెట్టాడు- "మన ప్రాంతంలోకెల్లా అత్యుత్తమమైన దానిమ్మలు మీకిక్కడ లభిస్తాయి. అయితే వాటి ధర మాత్రం మమూలు దానిమ్మలకంటే ఎక్కువ" అని. ఇక చూడాలి- చుట్టు ప్రక్కల ప్రాంతాలనుండి జనాలు వాటిని కొనేందుకు బారులు తీరారు!

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License