Saturday 25 July 2009

చట్టాలు-చట్ట నిర్మాతలు

పూర్వం ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన గొప్ప జ్ఞాని కూడా. తన ప్రజలకోసం కొన్ని చట్టాలు చేయాలని సంకల్పించాడాయన:

తన రాజ్యంలోని వెయ్యి తెగలనుండీ వెయ్యి మంది జ్ఞానవంతులను రాజధానికి పిలువనంపి, చట్టాలు చేసే బాధ్యతను వారికి అప్పజెప్పారు రాజుగారు.

వారు కలిసి కూర్చుని, వెయ్యి చట్టాలని నిర్మించి, కాగితంపై రాసి ఇచ్చారు. ఆ కాగితాలను చూసిన రాజుగారి ఆత్మ ఘోషించింది. ఎందుకంటే అప్పటివరకు తన రాజ్యంలో వెయ్యి రకాల నేరాలున్నాయని ఆయనకి తెలియదు.

అప్పుడు ఆయన తన వ్రాతగాడిని పిలిచి, చిరునవ్వుతో, తనంతట తానే స్వయంగా చట్టాలని నిర్దేశించాడు. ఆయన నియమాలు కేవలం ఏడు మాత్రమే అయినాయి.

ఇక ఆ వేయిమంది జ్ఞానులకు కోపం వచ్చింది. వాళ్ళు రాజును వదిలి, తమ తమ జాతులలోకి వెళ్లిపోయారు- ఎవరు తయారుచేసిన చట్టాలను వాళ్లు తీసుకొని. ఏ జాతి కా జాతి, తమ జ్ఞాని నిర్మించిన చట్టాన్ని పాటించింది.

అలా వాళ్లకు ఈనాటికీ వెయ్యిచట్టాలు కావలసి వచ్చింది.

చాలా గొప్పదేశం అది. అయితే దానిలో ఇప్పుడు వెయ్యి చెరసాలలున్నాయి. వెయ్యి చట్టాలను అతిక్రమించిన స్త్రీలు,పురుషులతో ఆ వెయ్యి జైళ్లూ నిండిపోయి ఉన్నాయి.

నిజంగానే అది చాలా గొప్పదేశం. అయితే అక్కడి ప్రజల్ని చూస్తే, వెయ్యిమంది చట్టనిర్మాతల వారసులకు గాను, ఒకే ఒక్కరు జ్ఞానవంతుడైన రాజు వారసులున్నారు.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License