Monday 6 July 2009

పిడుగుపాటు

ఒకనాడు, బయట తుఫాను చెలరేగుతున్న సమయంలో, ఒక బిషప్ (ఫాదర్) గారు తన కాథెడ్రల్ (చర్చి)లో కూర్చుని ఉన్నారు. ఆయనకు ఎదురుగుండా నిలబడ్డ యువతి క్త్రెస్తవురాలు కాదు. ఆమె బిషప్ ను అడిగింది: "నేను క్త్రెస్తవురాలిని కాదు. మరి నాకు నరకలోకపు అగ్నిజ్వాలల నుండి విముక్తి ఉంటుందా?" అని.

బిషప్ గారు ఆమెనే చూస్తూ స్థిరంగా చెప్పారు- "లేదు, పరిశుధ్ధాత్మ సాక్షిగా పవిత్రజలంతో బాప్తిస్మం స్వీకరించిన వారికి మాత్రమే నరకపు జ్వాలల నుండి రక్షణ లభిస్తుంది." అని.

సరిగ్గా ఆయన ఇలా చెబుతుండగానే ఆకాశంనుండి ఫెళఫెళమంటూ ఒక పిడుగు సూటిగా కాథెడ్రల్ మీద పడింది. కూలిపోయిన కాథెడ్రల్ నిండా అగ్నిజ్వాలలు నిండాయి.

ఆ నగరపు ప్రజలు పరుగెత్తుకొని వచ్చి, కాథెడ్రల్ లోని మహిళను కాపాడగలిగారు; కానీ బిషప్ గారు బ్రతకలేదు- ఆయన అగ్నిజ్నాలలకు ఆహుతయ్యారు.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License