Saturday, 25 July, 2009

చాలా‌ పాత ద్రాక్ష సారాయి

చాలా కాలం క్రితం ఒక గొప్ప ధనికుడుండేవాడు. అతని ఇంట్లో ఒక పానశాల ఉండేది. అందులో చాలా‌విలువైన ద్రాక్ష సారాయిలు ఉండేవి. వాటి‌లో అతి పురాతనమైన ద్రాక్ష సారాయి ఒకటి, ఒక జాడీలో నిలువ ఉండేది. ధనికుడు దాని మూత విప్పకుండా అలాగే ఉంచేశాడు- ఏదైనా ప్రత్యేకమైన సందర్భంలోనే తీద్దామని!

ఒకసారి ఆ రాష్ట్ర గవర్నర్ అతన్ని సందర్శించేందుకు వచ్చాడు. "కేవలం ఒక మామూలు గవర్నర్ కోసం ఇంత మంచి సారాయిని తీయటం దండగ" అనుకొని, ధనికుడు ఊరుకున్నాడు.

ఒకసారి వాళ్ళ మతాచార్యుడు అతన్ని సందర్శించాడు. కానీ ధనికుడు అనుకున్నాడు- "నేను ఆ జాడీని తెరవను. ఇతనికి దాని విలువా తెలీదు, సున్నితమైన దీని సువాసన ఇతని ముక్కు పుటాలను చేరనూ చేరదు" అని.

ఇంకొకసారి ఆ దేశపు యువరాజు అతని ఇంట భోజనం చేశాడు. కానీ ధనికుడు అనుకున్నాడు- "రాజాధిరాజులకే తప్ప, ఇంత చిన్న యువరాజుకు దీన్ని సేవించే అర్హత లేదు" అని.

తన అల్లుడి పెళ్లి సందర్భంలో కూడా అతనా జాడీని తెరువలేదు- "ఈ అతిథుల్లో ఎవరికీ అంత గొప్ప సారాయిని సేవించే అర్హత లేదు" అనుకున్నాడు.

ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి. చాలా ముసలివాడైన ధనికుడు, ఒకరోజున చనిపోయాడు. ప్రతి విత్తనాన్ని భూమిలో పూడ్చినట్లే, అతన్నీ భూమిలో పాతిపెట్టారు.

అతన్ని పూడ్చిపెట్టిన రోజున, అతని పానశాలలోని సారాయిలన్నిటినీ బయటికి తెచ్చారు. మిగిలిన అన్ని జాడీలతోబాటు ఈ జాడీ కూడా బయటికి వచ్చింది. ఇరుగు పొరుగు రైతులందరూ ఆ మద్యాలను పంచుకొని తాగారు.

ఎవ్వరికీ ఆ జాడీలోని సారాయి ప్రత్యేకంగా అనిపించలేదు.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License