Saturday, 25 July, 2009

పిల్లి - ఎలుక

ఒకసారి, ఓ సాయం సమయంలో, ఒక కవి ఒక రైతును కలిశాడు. కవి ఏదో లోకంలో ఉన్నాడు; రైతు మొహమాటంగా ఉన్నాడు. అయినా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు:

రైతు అన్నాడు- "నేను ఈ మధ్యకాలంలో విన్న కథ ఒకటి చెబుతాను, నీకు.

ఒకసారి, ఎలుక ఒకటి ఒక బోనులో చిక్కుకున్నదట. ఆ బోనులో పెట్టిన జున్ను ముక్కను అది సంతోషంగా తింటుండగా, పిల్లి ఒకటి వచ్చి, ప్రక్కనే నిల్చున్నది. ఎలుక ఒక క్షణ కాలం పాటు గజగజలాడింది. కానీ వెంటనే దానికి అర్థమైంది- తనకు పిల్లి భయం లేదని.

అప్పుడు పిల్లి అన్నది- "ఇదే నీ చివరి భోజనం మిత్రమా!" అని.

"అవును" అన్నది ఎలుక. "నాకు ఒక్కటే ప్రాణం ఉంది; అందుకని నాకు ఉన్నదీ ఒక్క చావే. కానీ నీ సంగతి ఏమిటి? నీకు తొమ్మిది ప్రాణాలున్నాయని చెప్తారు! అంటే నువ్వు తొమ్మిదిసార్లు చావాల్సిందే గదా?!" అని.

ఈ కథ చెప్పి, రైతు అన్నాడు కవితో- "చాలా వింత కథ, కదూ?" అని.

కవి అతనికేమీ జవాబివ్వకుండానే, ఆలోచిస్తూ ముందుకు నడిచాడు: "నిజం! మనకుగూడా తొమ్మిది ప్రాణాలున్నాయి. నిజంగానే తొమ్మిది. మనం కూడా అందుకనే తొమ్మిదిసార్లు చస్తున్నాం. దీనికంటే బహుశ: రైతు మాదిరి ఒక బోనులో చిక్కుకొని, చివరి భోజనంగా ఓ జున్ను ముక్కని తిని, ఒకే ప్రాణంతో ఉండటం నయమేమో. అయినా మనం సింహాలం! ఎడారుల్లోనూ, అరణ్యాలలోనూ తిరుగాడే సింహాలం కాదూ, మనం?!" అనుకున్నాడు కవి!

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License