Saturday 25 July 2009

ప్రేమ-ద్వేషం

ఒక స్త్రీ అన్నది ఒక పురుషునితో: "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని.

అతడు అన్నాడు: "నీ ప్రేమకు నోచుకునే అర్హత నా యీ హృదయానికి ఉన్నది." అని.

ఆమె అడిగింది: "నువ్వు నన్ను ప్రేమించట్లేదా?" అని.

అతను ఊరికే ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. ఏమీ జవాబివ్వలేదు.

అప్పుడామె అరిచింది, కోపంగా: "నేను నిన్ను ద్వేషిస్తున్నాను" అని.

అతనన్నాడు: "అయితే నీ ద్వేషానికి నోచుకునే అర్హత కూడా నా హృదయానికి ఉన్నదన్నమాట!" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License