Saturday, 25 July, 2009

రూత్ అనే మహిళ

పచ్చని కొండ మీద ఒంటరిగా నిల్చుని ఉందొక తెల్లమిద్దె. దూరం నుండి ముగ్గురు వ్యక్తులు దాన్ని చూస్తున్నారు. వారిలో ఒకడు అన్నాడు- "అది రూత్ అనే ఆమె ఇల్లు. ఆమె ఒక ముసలి మంత్రగత్తె." అని.

"నువ్వు తప్పు చెప్తున్నావు. రూత్ ఒక అందమైన స్త్రీ. ఆమె తన కలలకే సొంతం" అన్నాడు రెండవవాడు.

అప్పుడు మూడవవాడు అన్నాడు: "మీరిద్దరు చెప్పిందీ తప్పే. రూత్ అనే మహిళ, విశాలమైన ఈ భూములకు యజమానురాలు. ఆమె తన బానిసల రక్తం పీలుస్తుంది" అని.

అలా వాళ్లు ముగ్గురూ రూత్ గురించి చర్చించుకుంటూ ముందుకు సాగారు.

ఒక కూడలిని చేరుకునే సరికి వాళ్లకొక ముసలి తాత ఎదురయ్యాడు. ఆ ముగ్గురిలో ఒకడు రూత్ గురించి అడిగాడు ఆ తాతను- "తాతా! కొండమీద, ఆ ఇంట్లో నివసించే మహిళ- రూత్- గురించి చెప్పండి మాకు" అని.

ముసలి తాత తలపైకెత్తి, నవ్వుతూ ఇలా అన్నాడు- "బాబులూ, ప్రస్తుతం నా వయసు తొంభై సంవత్సరాలు. నేను ఇంకా పిల్లవాడిగా ఉన్నప్పుడు చూసిన రూత్ ఇంకా నాకు గుర్తే. కానీ రూత్ అనే ఆ మహిళ ఎనభై సంవత్సరాల క్రితం చచ్చిపోయింది. ప్రస్తుతం ఆ ఇల్లు ఖాళీగా ఉన్నది. ఒక్కోసారి అందులోంచి గుడ్లగూబల అరుపులు వినిపిస్తుంటాయి. ఆ భవనంలో దెయ్యం ఉందని జనుల విశ్వాసం " అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License